పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సరికొత్త రికార్డు: 560 గిగావాట్లకు చేరిన విద్యుత్ సామర్థ్యం
పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సరికొత్త రికార్డు: 560 గిగావాట్లకు చేరిన విద్యుత్ సామర్థ్యం
punarutpadaka


న్యూఢిల్లీ, 13 నవంబర్ (హి.స.)

పర్యావరణ హితమైన

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ సరికొత్త

మైలురాయిని అధిగమించింది.దేశ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదక

సామర్థ్యం 560 గిగావాట్ల

మార్కును చేరుకుందని, అందులో

సగానికి పైగా శిలాజేతర (Non-fossil fuel) ఇంధన వనరుల నుంచే సమకూరుతోందని కేంద్ర నూతన మరియు పునరుత్పాదక

ఇంధన మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది.అక్టోబర్

2026 నాటి గణాంకాల ప్రకారం,

దేశంలోని మొత్తం

విద్యుత్ సామర్థ్యంలో 55 శాతం

అంటే దాదాపు 308 గిగావాట్ల

విద్యుత్ సౌర, పవన,

జల మరియు బయో ఎనర్జీ

వంటి హరిత వనరుల ద్వారా ఉత్పత్తి అవుతోంది.

2030 నాటికి

500 గిగావాట్ల శిలాజేతర

ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం దిశగా దేశం

వేగంగా అడుగులు వేస్తోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ముఖ్యంగా 'పీఎం సూర్య ఘర్:ముఫ్త్ బిజిలీ యోజన', పీఎం కుసుమ్ పథకాల అమలుతో పాటు

దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్ పార్కులు ఈ అద్భుత ప్రగతికి

కారణమయ్యాయి.బొగ్గు

ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, కర్బన ఉద్గారాలను నియంత్రించడంలో భారత్

సాధించిన ఈ విజయం అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంటోంది.గ్రీన్

హైడ్రోజన్ మిషన్ మరియు ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థల బలోపేతంతో రాబోయే రోజుల్లో

భారతదేశం ప్రపంచపు గ్రీన్ ఎనర్జీ హబ్‌గా అవతరించనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ ధీమా

వ్యక్తం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande