శారదా నదిలో మునిగి ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చోడవరం మండలం గోవాడ సమీపంలోని శారదా నదిలో మునిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Water


అనకాపల్లి , 13 నవంబర్ (హి.స.)అనకాపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చోడవరం మండలం గోవాడ సమీపంలోని శారదా నదిలో మునిగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అప్పారావు (54), నూకరాజు (46)గా గుర్తించారు. నదిలోకి వెళ్లిన వీరిద్దరూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

నదిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పారావు, నూకరాజు మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడటంతో గోవాడ పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. నదుల వద్దకు వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande