గిల్గిట్-బాల్టిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం... నదిలో వ్యాన్ పడి 11 మంది ప్రయాణికుల దుర్మరణం
గిల్గిట్-బాల్టిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం... నదిలో వ్యాన్ పడి 11 మంది ప్రయాణికుల దుర్మరణం
accident


గిల్గిట్-బాల్టిస్థాన్, 13 నవంబర్ (హి.స.)

గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక వ్యాన్ అదుపుతప్పి లోయలోని నదిలో పడిపోవడంతో అందులో ఉన్న 11 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.

కొండ ప్రాంతంలోని ఇరుకైన రహదారిపై ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మృతదేహాలను వెలికితీయడంలో సహాయక సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande