
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)
సమ్మక్క సాగర్ బ్యారేజీకి కావాల్సిన అనుమతులు త్వరగా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందిస్తూ అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్నినో పరిస్థితుల వల్ల రానున్న రోజుల్లో తెలంగాణలో నీటి అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్ సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం ఎంతో అవసరమని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న మిగతా అనుమతులను కూడా త్వరగా మంజూరు చేసేలా సహకరించాలని కోరారు. ప్రజల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్ఓసీ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు