సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏది?: కాంగ్రెస్ పార్టీని నిలదీసిన కేటీఆర్
సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏది?: కాంగ్రెస్ పార్టీని నిలదీసిన కేటీఆర్
KTR


హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని సీమాంధ్ర నాయకులు హెచ్చరించినా, సోనియా గాంధీ మాత్రం రాజకీయ భవిష్యత్తును లెక్కచేయకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారంటూ ఆ పార్టీ నేతలు తరచూ గొప్పలు చెప్పుకుంటుంటారని ఎద్దేవా చేశారు.

మరి నిజంగానే సోనియా గాంధీకి తెలంగాణపై అంత ప్రేమ ఉంటే, ఆమె రాసిన ఆత్మకథలో రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన విషయాలు ఎందుకు లేవని కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చామని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు, ఇందుకు సంబంధించిన కీలక ఘట్టాన్ని ఆత్మకథలో కనీసం ప్రస్తావించకపోవడం వెనుక ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande