హైదరాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు: రూ. 10.50 లక్షల సరుకు స్వాధీనం
హైదరాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు: రూ. 10.50 లక్షల సరుకు స్వాధీనం
హైదరాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు: రూ. 10.50 లక్షల సరుకు స్వాధీనం


హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా ఆటను నగర పోలీసులు కట్టించారు. బాలాపూర్ పోలీసులతో పాటు చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక దాడిలో రూ. 10.50 లక్షల విలువైన 21 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న మాదకద్రవ్యాల కట్టడిపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న బాలాపూర్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో ప్రధాన నిందితుడైన అంతర్రాష్ట్ర రవాణాదారుడు మహమ్మద్‌ను అరెస్ట్ చేయగా, అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు.

ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ ప్రాంతం నుంచి ఈ గంజాయిని సేకరించి హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకొస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మిగతా ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande