అక్వాను తుపాను.. విద్యుత్ శాఖ అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
karnataka-electricity-bill-hike-40-50-paise-per-unit-october-november


అమరావతి , 17 నవంబర్ (హి.స.)

అక్వాను తుపాను ముప్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్పెషల్ సీఎస్తో కలిసి తుపాను సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. భారీ గాలులు, వర్షాల కారణంగా ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేలా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అత్యవసర మరమ్మతుల కోసం అవసరమైన వాహనాలు, పరికరాలు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

అలాగే తుపాను సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగలు, నీటిలో ఉన్న విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. తుపాను సమయంలో నిరంతర విద్యుత్ సేవలు అందించేందుకు శాఖ సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande