అండాల అక్రమ దందాలో డాక్టర్ పద్మజా కీలక పాత్ర.. హైకోర్టుకు పోలీసుల నివేదిక
అండాల అక్రమ దందా వ్యవహారంలో డాక్టర్ పద్మజా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
అండాల అక్రమ దందాలో డాక్టర్ పద్మజా కీలక పాత్ర.. హైకోర్టుకు పోలీసుల నివేదిక


హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)అండాల అక్రమ దందా వ్యవహారంలో డాక్టర్ పద్మజా కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అండాల అక్రమ విక్రయాలు, లావాదేవీల వెనుక ఆమె పాత్రపై దర్యాప్తులో పలు విషయాలు గుర్తించినట్లు కోర్టుకు వివరించింది.

ఈ వ్యవహారంలో డాక్టర్ పద్మజా ప్రమేయానికి సంబంధించి సేకరించిన ఆధారాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను పోలీసులు తమ కౌంటర్లో ప్రస్తావించారు. అండాల దందా ఎలా కొనసాగింది? ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో పోలీసుల కౌంటర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా డాక్టర్ పద్మజా పాత్రకు సంబంధించి పోలీసులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై హైకోర్టు తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande