రాష్ట్రంలో 4.63 లక్షల మందికి చేయూత పెన్షన్లు.. మహిళా సంఘాలకు ఫంక్షన్ హాల్స్: మంత్రి సీతక్క
తెలంగాణ వ్యాప్తంగా 4.63 లక్షల మంది అర్హులకు పెన్షన్లు అందిస్తున్నామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
Seetakka


హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)

తెలంగాణ వ్యాప్తంగా 4.63 లక్షల మంది అర్హులకు పెన్షన్లు అందిస్తున్నామని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. పెన్షన్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. బుధవారం వరంగల్ జిల్లా సంగెం మండలం స్టేషన్ చింతలపల్లి టెక్స్టైల్ పార్క్ పైలాన్ వద్ద రూ. 45 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన నూతన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను మంత్రి సీతక్క స్వయంగా పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో ఆడకూతురు సంతోషంగా, ఆర్థికంగా బలంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరాటమని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande