దివ్యాంగులు, వృద్ధుల పెన్షన్ల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ.. జనగామ ఎమ్మెల్యే
జనగామ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం 716 మందికి కొత్త చేయూత పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు.
Mla


జనగామ, 17 నవంబర్ (హి.స.)

జనగామ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం 716 మందికి కొత్త చేయూత పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలన్నారు. నిబంధనల పేరు చెప్పి నిజమైన అర్హులకు అన్యాయం చేయొద్దని సూచించారు. ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తోందని చెప్పి మరో అర్హుడి పెన్షన్ ఆపేయడం సరికాదన్నారు. బతుకుదెరువు కోసం ట్రాక్టర్, డీసీఎం లాంటి వాహనాలు కొన్న కుటుంబాల పెన్షన్లు తొలగించవద్దని కోరారు. దివ్యాంగులు, వృద్ధుల పెన్షన్ల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను రూ.4 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. బీడీ, నేత కార్మికులు, దివ్యాంగులతో సహా అన్ని వర్గాలకు పెన్షన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులందరికీ న్యాయం జరిగే వరకు వారి తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande