ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు: ముగింపు వేడుకలకు ప్రధాని మోదీ హాజరు
ఖేలో ఇండియా గేమ్స్కు తెలంగాణ సర్కార్ భారీ ఏర్పాట్లు: ముగింపు వేడుకలకు ప్రధాని మోదీ హాజరు
Prime Minister Narendra Modi to visit Philippines from today


మహబూబ్‌నగర్, 17 నవంబర్ (హి.స.)

ప్రతిష్ఠాత్మక 'ఖేలో ఇండియా' 8వ ఎడిషన్ కబడ్డీ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి గర్వకారణమని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సకల సౌకర్యాలను అత్యంత పకడ్బందీగా సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రీడా పోటీల నిర్వహణ వివరాలను వెల్లడించారు.

క్రీడల నిర్వహణ విషయంలో నిధుల కొరత అనే ప్రశ్నే లేదని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ క్రీడల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.23 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.203.36 కోట్ల భారీ వ్యయంతో స్టేడియాల్లో అత్యాధునిక వసతులను కల్పిస్తున్నట్లు వివరించారు. కేవలం ఈ పోటీల కోసమే కాకుండా, రాబోయే 20 ఏళ్ల వరకు క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా మైదానాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కాగా, ఈ ఖేలో ఇండియా గేమ్స్ ముగింపు వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande