రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మందికి పైగా మహిళలకు కొత్త పింఛన్లు.. మంత్రి సీతక్క
రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మందికి పైగా మహిళలకు కొత్త పింఛన్లు.. మంత్రి సీతక్క
Minister


ములుగు, 17 నవంబర్ (హి.స.)

ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం కొత్త చేయూత పింఛన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్ ఉత్తర్వులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి ఆర్థిక భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, నేత కార్మికులతో సహా వివిధ వర్గాలకు చెందిన అర్హులకు కొత్త చేయూత పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. ఏళ్ల తరబడి పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న ఒంటరి మహిళలు, వితంతువులకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వయసుతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మందికి పైగా మహిళలకు కొత్త పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande