ప్రజల మేలుకోసమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్యే విజయ రమణారావు
ప్రజల మేలుకోసమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఎమ్మెల్యే విజయ రమణారావు
Mla


పెద్దపల్లి, 17 నవంబర్ (హి.స.) పెద్దపల్లి జిల్లాలోని పొత్కపల్లిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో 664 మందికి చేయూత పెన్షన్ పత్రాలు, 43 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు చేతికి అందాయి. ఓదెల మండలంలోని ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన 5 లక్షల పెన్షన్లలో పెద్దపల్లి నియోజకవర్గ వాటా 5,200 అని చెప్పారు. ముందు ముందు వృద్ధులకు కూడా పెన్షన్లు అందేలా చూస్తామన్నారు. పెన్షన్ మొత్తాన్ని పెంచే ఆలోచన కూడా ప్రభుత్వం ముందు ఉందని వెల్లడించారు. ప్రజల మేలు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారని, పేదలకు అండగా నిలుస్తున్నారని అన్నారు.

ఓదెల మండలంలో అన్ని గ్రామాలు అభివృద్ధి బాటలో ఉన్నాయని ఎమ్మెల్యే చెప్పారు. మండల కేంద్రంతో పాటు మల్లికార్జున స్వామి ఆలయం చుట్టుపక్కల రోడ్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామాలన్నింటికీ డబుల్ రోడ్లు మంజూరవుతున్నాయని, రాజకీయాలకు, వివక్షకు తావు లేకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande