ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల సందడి.. నేటితో నామినేషన్ల గడువు ముగింపు
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ సందడి ఊపందుకుంది. తొలి విడత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల సందడి.. నేటితో నామినేషన్ల గడువు ముగింపు


అమరావతి , 17 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ సందడి ఊపందుకుంది. తొలి విడత ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల సమర్పణకు గడువు నేటితో ముగియనుండటంతో ఆశావహులు చివరి నిమిషంలో తమ దరఖాస్తులను సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను దక్కించుకునేందుకు వివిధ పార్టీల మద్దతుదారులు వ్యూహాలు రచిస్తున్నారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా రేపు అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాలు, ఇతర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతను నిర్ధారించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ గడువు ముగిసిన తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా స్పష్టమవుతుంది.

మొదటి విడత పంచాయతీ ఎన్నికలను ఈ నెల 26వ తేదీన నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు పోలింగ్ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande