ర్యాగింగ్ చేసే వారిపై కఠిన చర్యలు.. రాజన్న జిల్లా ఎస్పీ
ర్యాగింగ్ చేసే వారిపై కఠిన చర్యలు.. రాజన్న జిల్లా ఎస్పీ
Sp


రాజన్న సిరిసిల్ల, 17 నవంబర్ (హి.స.)

సిరిసిల్ల మెడికల్ కళాశాలలో మంగళవారం వైద్య విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వేదికలు వాడేటప్పుడు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని, సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లు, అనుమానం కలిగించే లింకులను అస్సలు నమ్మొద్దని చెప్పారు. తమ వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలన్నారు.

ర్యాగింగ్, గంజాయి, డ్రగ్స్ జోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో చదువుకుని మంచి వైద్యులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ర్యాగింగ్ చేస్తే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా వేధిస్తే యాంటీ ర్యాగింగ్ కమిటీని ఆశ్రయించాలని చెప్పారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande