తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత.. కోహిర్లో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు.
Dense fog


అమరావతి , 17 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

మొయినాబాద్లో 11.8 డిగ్రీలు, గాంధారిలో 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నేరడిగొండలో 13 డిగ్రీలు, గండీడ్లో 13.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శివంపేటలో 13.3 డిగ్రీలు, ఉప్పల్లో 13.4 డిగ్రీలు నమోదయ్యాయి. సిర్పూర్ (యు) ప్రాంతంలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రత 13.4 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం వేళల్లో బయటకు వచ్చేవారు వెచ్చని దుస్తులు ధరించాలని ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు చలి నుంచి రక్షణ పొందేలా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎలా ఉండబోతోందనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande