బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అక్వాన్' తుపాను: సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం!
బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'అక్వాన్' తుపాను: సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం!
Akwaan Cyclone


అమరావతి, 17 నవంబర్ (హి.స.)

బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుపాను క్రమంగా బలపడుతూ ముందుకు కదులుతోంది. ప్రస్తుతం ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతుండగా, ఈరోజు సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుపాను కదలికలను విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోంది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం, అక్వాన్ తుపాను చెన్నైకి 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రభావంతో తీరప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం ఉండటంతో పాటు, పలు లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారే సూచనలు ఉండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తీరప్రాంత ప్రజలతో పాటు రైతులు కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు అధికారిక హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande