
అనంతపురం, 17 నవంబర్ (హి.స.)
అనంతపురం జిల్లా గుమ్మగట్ట కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)లో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ప్రజారోగ్య శాఖ సంచాలకుడు ఆర్. వెంకటరమణతో పాటు జిల్లా వైద్య అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
గత రాత్రి పాఠశాలలో వడ్డించిన భోజనంలో సాంబారు తిన్న తర్వాత సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనైనట్లు అధికారులు మంత్రికి వివరించారు. వీరిలో నలుగురు విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం గుమ్మగట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (PHC) తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi