
హైదరాబాద్, 17 నవంబర్ (హి.స.)
పాత పెన్షన్ పథకం (ఓపీఎస్)ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) ఉద్యోగులు మంగళవారం సామూహిక సెలవు (Mass Leave) ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారీ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సామూహిక సెలవుల ఉద్యమానికి రాష్ట్రంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులు పెద్ద ఎత్తున గైర్హాజరు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల్లో రోజువారీ కార్యకలాపాలకు కొంత మేర అంతరాయం కలిగే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi