ఏపీలో SIR ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
eci-directs-states-to-begin-ssr-after-sir-draft-voter-list-on-december-1


అమరావతి , 18 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్లో మార్పులు చేస్తూ కొత్త తేదీలను వెల్లడించింది. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడం, వివరాలను సరిచేసుకోవడం కోసం ఇప్పటివరకు ఫారమ్లు సమర్పించని వారికి మరో అవకాశం కల్పించింది.

ముఖ్యంగా ASDD కేటగిరీలో ఉన్న ఓటర్లకు ఎన్నికల సంఘం అదనపు గడువు ఇచ్చింది. ఈ కేటగిరీకి చెందిన వారు తమ వివరాలను సమర్పించేందుకు వీలుగా నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఫారమ్ల పంపిణీ, సేకరణ ప్రక్రియ కొనసాగనుంది. అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి అర్హతలను నిర్ధారించనున్నారు. ఈ పరిశీలనకు డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు విధించారు.

అనంతరం ఓటర్ల జాబితాకు సంబంధించి వచ్చే క్లెయిమ్లు, అభ్యంతరాలను డిసెంబర్ 15వ తేదీలోగా పరిష్కరించనున్నారు. అన్ని దశలు పూర్తయిన తర్వాత డిసెంబర్ 22వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.

ఎన్నికల సంఘం కల్పించిన ఈ అదనపు అవకాశాన్ని అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా సవరణ ప్రక్రియ పూర్తి చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande