జెడ్పీ చైర్మన్ పదవుల పంపకాలపై కూటమిలో ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల కేటాయింపుపై అధికార కూటమి పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 జెడ్పీ చైర్మన్ స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పంపిణీ చేసే అంశంపై కసరత్తు కొనసాగుతోంది.
Vote


అమరావతి , 18 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల కేటాయింపుపై అధికార కూటమి పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 జెడ్పీ చైర్మన్ స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పంపిణీ చేసే అంశంపై కసరత్తు కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపికపై నేడు లేదా రేపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి నేతలు కేటాయింపులపై చర్చలు వేగవంతం చేశారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం టీడీపీకి 21 నుంచి 22 స్థానాలు, జనసేనకు 4 నుంచి 5 స్థానాలు, బీజేపీకి ఒక స్థానం కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే జనసేన మాత్రం ఐదు జెడ్పీ చైర్మన్ పదవులను కోరుతున్నట్లు తెలుస్తోంది. తమకు మరిన్ని స్థానాలు కేటాయించాలని ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా శ్రీకాకుళం, కృష్ణా, కాకినాడ జిల్లాల్లో చైర్మన్ పదవుల కేటాయింపుపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమగోదావరి, అనకాపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ పోటీ నెలకొంది. మరోవైపు కడప జెడ్పీ చైర్మన్ పదవి కోసం టీడీపీ, బీజేపీ మధ్య పోటీ ఉండటంతో ఈ స్థానం ఎవరికి దక్కుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. అధిష్ఠానం తీసుకునే తుది నిర్ణయంపై కూటమి నేతలు, ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande