
అమరావతి , 18 నవంబర్ (హి.స.)
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు, రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల మధ్య ఐక్యతను కాపాడుకోవాలని, పొత్తు ధర్మాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన ఓట్ల శాతం కంటే స్థానిక ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలకు ప్రభుత్వ పనితీరును, వాస్తవ పరిస్థితులను వివరించి వారి మద్దతు పొందాలని సూచించారు. స్థానిక ఎన్నికలు కూటమి బలాన్ని మరోసారి నిరూపించుకునేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు. ఏ ఒక్క వార్డులో ఓటమి ఎదురైనా అందుకు గల కారణాలను సమీక్షిస్తానని పార్టీ నాయకులను హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్