రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువు మరోసారి పొడిగింపు
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
ELECTION


హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల నమోదు, జాబితా సవరణకు మరింత సమయం కల్పిస్తూ గడువును మరోసారి పొడిగించింది. తొలుత ఈ నెల 30వ తేదీతో ముగియాల్సిన గడువును డిసెంబర్ 22 వరకు పెంచుతూ నిర్ణయం ప్రకటించింది.

ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులకు ఈ నిర్ణయం ద్వారా మరో అవకాశం లభించనుంది. ఇప్పటివరకు ఓటరుగా నమోదు చేసుకోలేకపోయిన వారు, అలాగే జాబితాలో తమ పేర్లు లేని వారు ఈ గడువులోగా అవసరమైన దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది.

ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో ముందుగానే పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పేరు లేకపోతే నిర్ణీత గడువులోగా సంబంధిత ఫారాలు సమర్పించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande