
హైదరాబాద్ , 18 నవంబర్ (హి.స.)
హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి ప్రయత్నం అనంతరం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? ఆస్తి నష్టం ఎంతమేర జరిగింది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. విద్యుత్ పరికరాలు, వైరింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్