
అమరావతి , 18 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల పదవుల పంపకాలపై కూటమి పార్టీల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో ఈరోజు సాయంత్రం జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ నేత మాధవ్ సమావేశం కానున్నారు. రేపు జరగనున్న ఎంపీపీ అధ్యక్షుల ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ముఖ్యంగా ఎంపీపీ అధ్యక్ష పదవులను కూటమిలోని మూడు పార్టీలకు ఏ విధంగా కేటాయించాలనే అంశంపై నేతలు చర్చించనున్నారు. ఆయా ప్రాంతాల్లో పార్టీల బలం, స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పదవుల పంపకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి నిర్వహించనున్న జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్