
కామారెడ్డి, 18 నవంబర్ (హి.స.)
యాసంగిలో వరి వేసిన రైతులకు వెంటనే నీరు ఇవ్వాలని గంభీరావుపేటలో బీజేపీ నేతలు రోడ్డుపైకి వచ్చారు.
ఎగువ మానేరు జలాశయం నుంచే కాకుండా, నిండుగా ఉన్న చెరువుల నుంచి కూడా సాగునీటిని వదలాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
రైతులు, బీజేపీ నాయకులతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర కామారెడ్డి - సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.
నీరు వదలకపోతే గంభీరావుపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, రైతులకు పంట నష్టపరిహారంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరారు. పంట రుణాలు కట్టడానికి గడువు పెంచాలని, మండలంలోని అన్ని గ్రామాల్లో సాగునీటి అవసరం ఎంత ఉంది, చెరువుల్లో ఎంత నీరు ఉంది అనే విషయంపై ప్రత్యేక బృందంతో సర్వే చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..