ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల సందడి.. నేడు నామినేషన్ల పరిశీలన
ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అధికారులు నేడు వాటి పరిశీలన చేపట్టనున్నారు.
Vote


అమరావతి , 18 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే నామినేషన్ల దాఖలు గడువు ముగియడంతో అధికారులు నేడు వాటి పరిశీలన చేపట్టనున్నారు. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని ఆమోదించనున్నారు. ఏవైనా లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోనున్నారు.

నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులకు కీలకమైన ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం తుది అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది.

ఈ నెల 26వ తేదీన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. గ్రామాల్లో రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande