విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ.. మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, 18 నవంబర్ (హి.స.) మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మోడల్ స్కూల్ లో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి మంత్రి వివేక్ వెంకటస్వామి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. అక్కడ పెట్టిన ఆహారం ఎలా ఉందో స్వయంగా చూ
Minister


మంచిర్యాల, 18 నవంబర్ (హి.స.)

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మోడల్ స్కూల్ లో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసి మంత్రి వివేక్ వెంకటస్వామి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అల్పాహార పథకాన్ని ప్రారంభించారు.

అక్కడ పెట్టిన ఆహారం ఎలా ఉందో స్వయంగా చూసి నాణ్యతను పరిశీలించారు. పేద పిల్లలకు బలమైన ఆహారం అందించడంతో పాటు బడికి వచ్చే పిల్లల సంఖ్య పెరగడం, చదువు మీద శ్రద్ధ పెరగడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

పిల్లలు పెద్ద లక్ష్యాలు పెట్టుకుని చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించిన మంత్రి, బాగా చదివే వారికి బహుమతులు ఇస్తానని ప్రకటించారు. ఆ పాఠశాలలో భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ కట్టడానికి 40 లక్షల రూపాయలు ఇస్తున్నామని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande