మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ఉద్దేశం.. మంత్రి సీతక్క
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం, పేద కుటుంబాలు బాగుపడటమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి సీతక్క అన్నారు.
Minister


ములుగు, 18 నవంబర్ (హి.స.)

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం, పేద కుటుంబాలు బాగుపడటమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి సీతక్క అన్నారు.

ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, తలసేమియా బాధితులను ఆదుకోవడానికి కొత్త పింఛన్లు తీసుకొచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

బుధవారం మల్లంపల్లి మండల కేంద్రంలో జరిగిన కొత్త చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4.60 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చామని వెల్లడించారు. వారిలో దాదాపు 3.50 లక్షల మంది మహిళలే ఉన్నారని చెప్పారు. గతంలో పింఛన్ల కోసం అప్లై చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయని, సర్టిఫికెట్ల సమస్యలు, ఇతర కారణాలతో గడువును చాలాసార్లు పెంచి అర్హులందరికీ అవకాశం ఇచ్చామని వివరించారు. మహిళా సంఘాలను బలోపేతం చేసి మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande