కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి వాకిటి
ఖమ్మం జిల్లా మధిరలో కొత్త సామాజిక పింఛన్ల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ప్రారంభించారు.
Minister


ఖమ్మం, 18 నవంబర్ (హి.స.)

ఖమ్మం జిల్లా మధిరలో కొత్త సామాజిక పింఛన్ల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

ఎలాంటి ఆంక్షలు లేకుండా పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదే ఇస్తున్నామని, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నాయకత్వంలో పేదలందరికీ సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలు ఆగబోవని స్పష్టం చేశారు. మహిళల దీవెనలతో మరోసారి ఇందిరమ్మ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande