
హైదరాబాద్ , 19 నవంబర్ (హి.స.)
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పరిధిలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. అక్కడ ఉన్న పసిఫికా హిల్క్రెస్ట్ హైరైజ్ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఘటనను గమనించిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టి, శ్రమించి వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అపార్ట్మెంట్లో నివాసితులు ఉండటంతో స్థానికంగా కొంతసేపు ఆందోళన నెలకొంది.
అయితే మంటలు ఏ కారణంగా చెలరేగాయనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? ఆస్తి నష్టం ఎంత జరిగింది? అనే వివరాలు కూడా వెల్లడికావాల్సి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు పరిశీలన చేపట్టే అవకాశం ఉంది. హైరైజ్ భవనాల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ మొదలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్