
హైదరాబాద్ , 19 నవంబర్ (హి.స.)తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పక్కనపెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కులను తాకట్టు పెట్టి చంద్రబాబు, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు చెందిన నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మౌనంగా ఉండటానికి కారణమేంటని నిలదీశారు. ఏడాది కాలంగా సొరంగం పనులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు.
తెలంగాణ నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోదని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్మించి తెలంగాణ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్