తొలి విడత పంచాయతీ ఎన్నికలకు భారీ స్పందన.. 1.18 లక్షలకు పైగా నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ విడతలో సర్పంచి, వార్డు సభ్యుల పదవుల కోసం మొత్తం 1.18 లక్షలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.
Vote


అమరావతి , 19 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ విడతలో సర్పంచి, వార్డు సభ్యుల పదవుల కోసం మొత్తం 1.18 లక్షలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ముందుకు రావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది.

తొలి విడతలో ఎన్నికలు నిర్వహించనున్న 3,949 సర్పంచి స్థానాలకు 25,985 నామినేషన్లు అందాయి. అలాగే 39,830 వార్డు సభ్యుల స్థానాల కోసం 92,129 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. దీంతో రెండు విభాగాల్లో కలిపి మొత్తం 1,18,114 నామినేషన్లు నమోదయ్యాయి. మంగళవారంతో తొలి విడత గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది.

మరోవైపు, ఘర్షణలు, రాజకీయ ఉద్రిక్తతలు ఎక్కువగా చోటుచేసుకున్న అన్నమయ్య జిల్లాలో అత్యల్ప సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రెండో విడతలో ఎన్నికలు జరగనున్న 4,975 గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande