మత్స్యకారుల మాటలు కలచివేశాయి.. బాధితులను ఆదుకోండి: వైఎస్ జగన్
అగ్నిప్రమాదంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు.
మత్స్యకారుల మాటలు కలచివేశాయి.. బాధితులను ఆదుకోండి: వైఎస్ జగన్


అమరావతి , 19 నవంబర్ (హి.స.) అగ్నిప్రమాదంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులతో మాట్లాడిన సందర్భంగా వారి కష్టాలు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా సుమారు 300 కుటుంబాల జీవనోపాధి దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదంలో మత్స్యకారులకు చెందిన వలలు, చేపల వేటకు ఉపయోగించే ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. ఈ ఘటనలో దాదాపు రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. ప్రతిరోజూ సముద్రంలో వేటకు వెళ్లి సంపాదించిన డబ్బుతోనే కుటుంబాలను పోషించుకునే నిరుపేద మత్స్యకారులు ఇప్పుడు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగన్ అన్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులకు అవసరమైన వలలు, వేట సామగ్రిని సమకూర్చి తిరిగి ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోకపోతే, భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande