హైదరాబాద్లో మాంసం దుకాణాలపై అధికారుల కొరడా.. విస్తృత తనిఖీలు
హైదరాబాద్ నగరంలో మాంసం విక్రయ కేంద్రాలపై టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్లో మాంసం దుకాణాలపై అధికారుల కొరడా.. విస్తృత తనిఖీలు


హైదరాబాద్ , 19 నవంబర్ (హి.స.)

హైదరాబాద్ నగరంలో మాంసం విక్రయ కేంద్రాలపై టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 11 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లోని మాంసం దుకాణాలు, చికెన్ సెంటర్లను పరిశీలించాయి. ఈ తనిఖీల్లో అనేక చోట్ల అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కొన్ని దుకాణాల్లో విక్రయానికి ఉంచిన మాంసంపై పెద్ద సంఖ్యలో ఈగలు వాలడం అధికారులను విస్మయానికి గురిచేసింది. చికెన్ కటింగ్ సమయంలో వెలువడిన వ్యర్థాలను సరైన విధంగా తొలగించకుండా నేలపైనే వదిలేశారు. అంతేకాకుండా కొన్ని కేంద్రాల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తున్నట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. ఆహార పదార్థాల విక్రయానికి సంబంధించి పాటించాల్సిన కనీస పరిశుభ్రత ప్రమాణాలను కూడా పట్టించుకోవడం లేదని అధికారులు గుర్తించారు.

నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని మాంసం విక్రయ కేంద్రాలను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరికొన్ని దుకాణాల యజమానులకు షోకాజ్ నోటీసులతో పాటు ఇంప్రూవ్మెంట్ నోటీసులు అందజేశారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రజలకు సురక్షితమైన మాంసం అందించడమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande