ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రింటర్ల బకాయిలను చెల్లించాలి.. హరీష్ రావు
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను ముద్రించి సరఫరా చేసిన ప్రింటర్లకు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న సుమారు రూ. 76 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హరీష్ రావు


హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)

ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను ముద్రించి సరఫరా చేసిన ప్రింటర్లకు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న సుమారు రూ. 76 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే స్పందించి చిన్న పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు.

మూసీ సుందరీకరణ, అందాల పోటీలు, ఫుట్బాల్ షోలు వంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయి కానీ పేద విద్యార్థులకు ఉచితంగా ఇచ్చే పాఠ్యపుస్తకాలను ముద్రించిన వారికి బిల్లులు ఇవ్వడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు, ప్రభుత్వ అవసరాల కోసం పుస్తకాలు ముద్రించిన చిన్న పరిశ్రమలు తమ బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరమని అన్నారు.

తెలంగాణ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆవేదనను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని 56 మంది వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్లకు సుమారు రూ. 76 కోట్ల బిల్లులు గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు, గత 25 ఏళ్లుగా ప్రభుత్వానికి సేవలు అందిస్తూ నిర్ణీత గడువులోగా నాణ్యతతో పుస్తకాలను సరఫరా చేస్తున్నా బిల్లులు ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande