హైదరాబాద్లో ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభం
హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సదస్సు ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Union Minister Nitin Gadkari addressing in election meeting in Guwahati on Thursday.


హైదరాబాద్ , 19 నవంబర్ (హి.స.)

హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) సదస్సు ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా రహదారుల రంగానికి చెందిన నిపుణులు, అధికారులు, ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.

'కనెక్టింగ్ రోడ్స్.. క్రియేటింగ్ టుమారో' అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రహదారుల నిర్మాణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రోడ్ల నాణ్యత పెంపు, రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడం వంటి అంశాలపై ఇందులో విస్తృతంగా చర్చించనున్నారు. రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లు, నూతన ఆవిష్కరణలు, పర్యావరణహిత విధానాలపైనా నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రవాణా రంగం కీలకమవుతున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో రహదారుల అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande