పేదవాడు గౌరవంగా బతకడానికి ఒక ఆధారం సొంతిల్లు.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల పట్టణం లో గురువారం జరిగిన కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 370 మందికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.
MLA


జగిత్యాల, 19 నవంబర్ (హి.స.)

జగిత్యాల పట్టణం లో గురువారం జరిగిన కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 370 మందికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ పేద కుటుంబానికి సొంతిల్లు అంటే కేవలం తల దాచుకునే చోటు మాత్రమే కాదని గౌరవంగా బతకడానికి ఒక ఆధారం అని చెప్పారు, గతంలో ఎన్నో ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులందరికీ ఇందిరమ్మ పాలనలో ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి అర్హులందరికీ వరుసగా ఇళ్లు మంజూరు చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ ఫలాలు నేరుగా పేదల ఇంటి వద్దకే చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సాయంతో మంచి నాణ్యతతో

ఇళ్లు కట్టుకోవాలని లబ్ధిదారులకు సూచించారు, నిర్మాణ సమయంలో ఏదైనా సమస్య వస్తే తనకు చెప్పాలని, అధికారులతో మాట్లాడి వెంటనే తీర్చే ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారు.

ఇంకా దరఖాస్తు పెట్టుకోని అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, ఒక్క అర్హుడు కూడా మిగిలిపోకుండా చూస్తామని తెలిపారు, పేదల సొంతింటి కలను నిజం చేయడానికే ఈ పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఎమ్మెల్యే అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande