కడప జిల్లాలో పలు మండలాలకు ఎంపీపీలు ఖరారు.. టీడీపీకి కీలక స్థానాలు
కడప జిల్లాలో పలు మండలాల ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. వివిధ మండలాలకు కొత్త మండల పరిషత్ అధ్యక్షులను ఎన్నుకున్నారు.
Vote


కడప , 19 నవంబర్ (హి.స.)

కడప జిల్లాలో పలు మండలాల ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. వివిధ మండలాలకు కొత్త మండల పరిషత్ అధ్యక్షులను ఎన్నుకున్నారు. వీరబల్లి మండల ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన సోమారపు నాగార్జునాచారి ఎన్నికయ్యారు. అలాగే టి.సుండుపల్లి మండల పరిషత్ అధ్యక్షుడిగా టీడీపీ అభ్యర్థి సి. రమేష్ నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు.

సిద్ధవటం మండల ఎంపీపీ పదవిని జనసేన పార్టీ దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి అతిగారి వినూత ఎన్నికైనట్లు ప్రకటించారు. మరోవైపు నందలూరు మండలంలో స్వతంత్ర అభ్యర్థి ఎద్దుల ప్రమీల ఎంపీపీగా విజయం సాధించారు. ఒంటిమిట్ట మండల పరిషత్ అధ్యక్షురాలిగా టీడీపీకి చెందిన సండ్రపల్లి వెంకటరమణ ఎన్నికయ్యారు.

ఇక రాజంపేట మండల పరిషత్ అధ్యక్షురాలిగా హస్తవరం ఎంపీపీ చాముండేశ్వరి (టీడీపీ) ఎన్నికయ్యారు. తాజా ఎన్నికలతో జిల్లాలోని ఆయా మండలాలకు నాయకత్వం ఖరారైంది. ఈ ఫలితాలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఎన్నికైన ఎంపీపీలు త్వరలో తమ బాధ్యతలు స్వీకరించి మండలాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande