
కామారెడ్డి, 19 నవంబర్ (హి.స.)
సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యం అందించడంతో పాటు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆదేశాల మేరకు బాన్సువాడ పట్టణంలోని తిరుమల రైస్ షాప్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం తగ్గడం, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం పడటం వంటి కారణాలతో సన్న బియ్యం ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తూ ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రైస్ కౌంటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు.
ఈ కేంద్రంలో బహిరంగ మార్కెట్ ధరల కంటే తక్కువకు వివిధ రకాల సన్న బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డుదారులతో పాటు రేషన్ కార్డులు లేని అల్పాదాయ వర్గాల ప్రజలు కూడా ఈ కేంద్రం ద్వారా బియ్యం కొనుగోలు చేయవచ్చని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు