
భద్రాద్రి కొత్తగూడెం, 19 నవంబర్ (హి.స.)
మహిళలు ఆర్థికంగా ఎదిగి కుటుంబ అభివృద్ధితో పాటు గ్రామాల ప్రగతిలోనూ భాగస్వాములు కావాలని అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకాంక్షించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మహిళా సంఘాల బలోపేతానికి మరో ముందడుగు పడగా ఎమ్మెల్యే ఆదినారాయణ మండలంలోని గండుగులపల్లి, రెడ్యాలపాడు, శ్రీరామపురం, మారప్పగూడెం గ్రామాల్లో కొత్తగా కట్టిన మహిళా సమైక్య భవనాలను గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మహిళా సమైక్య భవనాలను నిర్మిస్తోందని చెప్పారు.
గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న డ్వాక్రా మహిళలకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని, మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి, ఇతర సంఘ కార్యకలాపాలకు ఈ భవనాలు శాశ్వత వేదికలుగా నిలుస్తాయని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..