
హైదరాబాద్, 19 నవంబర్ (హి.స.)
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి ఆమె చేసిన కృషిని, దేశ అభివృద్ధికి అందించిన సేవలను ఇరువురు మంత్రులు గుర్తుచేసుకున్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి ఆమె తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు, ప్రజాసేవకే అంకితమైన ఆమె నాయకత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..