జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
బాసరలో గోదావరి పుష్కరాల కోసం జరుగుతున్న పనులపై నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం సమీక్ష నిర్వహించారు.
Collector


నిర్మల్, 19 నవంబర్ (హి.స.)

బాసరలో గోదావరి పుష్కరాల కోసం జరుగుతున్న పనులపై నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలంటే అన్ని శాఖలు కలిసి పనిచేసి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

బాసర ఆలయ ఈవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఘాట్ల నిర్మాణం, భూసేకరణ, మౌలిక వసతుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గోదావరి నీటి మట్టం ఎలా ఉందో తెలుసుకుంటూ, పనుల ఫొటోలను ఎప్పటికప్పుడు పంపాలని చెప్పారు. పెండింగ్లో ఉన్న అనుమతులు, ప్రభుత్వ నిర్ణయాలను ఆలస్యం చేయకుండా త్వరగా పూర్తి చేయాలని, ప్రతి అధికారి తన పరిధిలోని పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

అదే సమయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా పరిశీలించిన కలెక్టర్, వాటిని త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పుష్కరాలకు వచ్చే ప్రముఖుల కోసం నిర్మిస్తున్న వసతి భవనాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande