జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ పిటిషన్లు.. తదుపరి విచారణ 30కి వాయిదా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ పిటిషన్లు.. తదుపరి విచారణ 30కి వాయిదా


హైదరాబాద్ , 19 నవంబర్ (హి.స.)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), హరిరామ జోగయ్య వేర్వేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జగన్కు సంబంధించిన కేసులు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వాటిని త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. దీంతో జగన్ కేసుల విచారణ వేగవంతం చేయాలన్న అంశంపై తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 30న హైకోర్టు విచారణ సందర్భంగా వెలువడే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande