లిక్కర్ స్కామ్ నిందితుడు ఈశ్వర్ను కస్టడీలోకి తీసుకున్న ఈడీ
లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఈశ్వర్ను అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
Enforcement directorate


అమరావతి , 02 నవంబర్ (హి.స.)

లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఈశ్వర్ను అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న ఆయనను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని ఈడీ అధికారులు నాంపల్లిలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం ఈశ్వర్ను రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది.

కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు విజయవాడ జైలుకు వెళ్లి ఈశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. లిక్కర్ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి ఈశ్వర్ కిరణ్ ప్రధాన అనుచరుడిగా వ్యవహరించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ను విచారించడం ద్వారా కుంభకోణానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని ఈడీ భావిస్తోంది. రెండు రోజుల కస్టడీ సమయంలో ఆయన నుంచి కీలక సమాచారం సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande