కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అనిల్ జాదవ్ విమర్శించారు.
Mla


నిర్మల్, 02 నవంబర్ (హి.స.)

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అనిల్ జాదవ్ విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ బోనస్ ఇచ్చే పార్టీ కాదని, బోగస్ చేసే పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాంకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ.

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో ప్రజలు కేసీఆర్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారని అనిల్ జాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 11న నిర్మల్ పట్టణంలో 50 వేల మందితో భారీ ఎత్తున యువ గర్జన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని వెల్లడించారు. యువ గర్జన సభకు ప్రతి గ్రామం నుంచి యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande