
గోదావరిఖని, 02 నవంబర్ (హి.స.)
గోదావరిఖని పవర్హౌస్ కాలనీలో సింగరేణి నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును సోమవారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రారంభించారు.
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతోపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో నడకకు, చిన్నారులు ఆటలాడుకునేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
పట్టణ ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదాన్ని దృష్టిలో ఉంచుకొని పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
అంతకుముందు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ తల్లి దేవాలయ స్థలాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రస్తుత పరిస్థితిని, పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాలను పరిశీలించి, పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అన్ని సౌకర్యాలతో షాపింగ్ కాంప్లెక్స్ ఆధునికీకరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..