బలహీనపడిన అక్వాన్ తుపాను.. ఉత్తరాంధ్ర జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు
అక్వాన్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. తుపాను తీవ్రత తగ్గడంతో తీరం దాటే దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Rain


అమరావతి , 20 నవంబర్ (హి.స.)

అక్వాన్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. తుపాను తీవ్రత తగ్గడంతో తీరం దాటే దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు సూచిస్తున్నారు.

అక్వాన్ తుపాను నేపథ్యంలో పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

తుపాను బలహీనపడుతున్నప్పటికీ దాని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసే సూచనలను పాటించాలని కోరుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు అవసరమైన ముందస్తు చర్యలకు సిద్ధమవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande