అండాల అక్రమ సేకరణ కేసు.. ఇద్దరు నిందితుల కస్టడీకి పోలీసుల పిటిషన్
అండాల అక్రమ సేకరణ వ్యవహారం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన మల్కాజ్గిరి పోలీసులు కీలక చర్యలకు సిద్ధమయ్యారు.
Arrest


హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)

అండాల అక్రమ సేకరణ వ్యవహారం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన మల్కాజ్గిరి పోలీసులు కీలక చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో అరెస్టయిన ఇద్దరు నిందితులను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

సద్గురు హెల్త్కేర్కు చెందిన బ్రాంచ్ ఇన్ఛార్జి ఆనంద్రాజు, అడ్మిన్ షేక్ సుభానీలను విచారించేందుకు పోలీసులు కస్టడీ కోరారు. ఈ అక్రమ సేకరణ వెనుక ఉన్న అసలు వ్యవహారాలు, ఇతరుల ప్రమేయం, కార్యకలాపాలు ఎలా సాగాయనే అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించడం ద్వారా ఈ కేసుకు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అండాల సేకరణకు సంబంధించిన నెట్వర్క్ ఎలా పనిచేసింది? అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కస్టడీ పిటిషన్పై న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి విచారణ జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande