వైఎస్ అవినాష్రెడ్డి కాన్వాయ్పై పెట్రోల్ బాంబులతో దాడి
కడప ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైఎస్ అవినాష్రెడ్డి కాన్వాయ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం కలకలం రేపింది.
Bangladesh Violence Erupts Again Yunus Ancestral Home Grameen Bank Branches Attacked Four Killed


కడప , 20 నవంబర్ (హి.స.)కడప ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైఎస్ అవినాష్రెడ్డి కాన్వాయ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం కలకలం రేపింది. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అవినాష్రెడ్డి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు రాళ్లు, పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు సమాచారం.

అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో కాన్వాయ్లో ఉన్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజకీయ కార్యక్రమానికి వెళ్తున్న ఎంపీ కాన్వాయ్పైనే దాడి జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఈ ఘటన వెనుక ఎవరున్నారు? దాడికి గల కారణాలేమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాడి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. ఎంపీ కాన్వాయ్పై దాడి జరగడంతో భద్రతా పరమైన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, దాడికి పాల్పడిన వారిని గుర్తించాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande